calender_icon.png 23 August, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి పంటపై రైతులకు అవగాహన సదస్సు

23-08-2025 12:50:04 AM

బెజ్జంకి: ఎల్డీసీ  జాగృతి, మోడర్న్ ఆర్కిటెక్ ఫర్ రూరల్ ఇండియా(మారి) ఫౌండేషన్ బెటర్ కాటన్ ప్రాజెక్టులో భాగంగా, లూయిస్ డైప్రాస్ కంపెనీ ఆధ్వర్యంలో రైతు సోదరులకు పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణపై  అవగాహన సమావేశం బేగంపేట రైతు వేదికలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి ఏఓ సంతోష్,  ఏఈఓ భరత్ ఎల్డీసీ ప్రతినిధి అఖిలేష్, మారి క్లస్టర్ కో ఆర్డినేటర్ గాండ్ల రాజు రైతులకు లింగకర్షణ బుట్టలు పంపిణీ చేసి అనంతరం వారు మాట్లాడుతూ... గులాబీ రంగు పురుగు నివారణపై, నష్ట పరిమితి శాతాన్ని గుర్తించడానికి రైతులకు లింగకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. 

పత్తి పంటలో గులాబీ రంగు పురుగు అరికట్టడానికి రసాయనాలు లేకుండా ఒక ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. రైతులకు శాస్త్రీయ పద్ధతుపై నియంత్రణ మార్గాలపై వివరించారు. పత్తి పంటలో అధిక దిగుబడి సాధించుటకు రసాయన ఎరువులు వాడకం తగ్గించాలని సేంద్రియ వ్యవసాయం లాభసాటిగా ఉంటుందన్నారు ,