calender_icon.png 19 May, 2025 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈటల.. నల్లికుట్ల రాజకీయాలు మానుకో

12-05-2025 03:02:12 AM

  1. సీఎంను ‘నా కొడకా’ అంటావా
  2. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ 

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): బీజేపీ ఎంపీ ఈటల రాజేం దర్ నల్లికుట్ల రాజకీయాలు మానుకోవాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీలో కోరుకున్న పదువులు రాకపోవడంతో గంజాయి తాగిన వ్యకిలా.. సైకోలా మారి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఆదివారం జగ్గారెడ్డి గాంధీభవన్‌లో మీడియాతో మా ట్లాడుతూ.. ఈటల రాజేందర్ లిమి ట్స్ దాటి మాట్లాడటంతోనే.. తా నూ లిమిట్స్ దాటాల్సి వస్తుందన్నా రు.

సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శ లు చేసే ముందు.. నియోజక వర్గసమస్యలపై సీఎంను ఎప్పుడైనా కలిశా వా? అని ఆయన నిలదీశారు. పార్లమెంటరీ భాషలో ప్రశ్నిస్తే.. తాము కూడా అదే భాషలో సమాధానమిస్తామని, బూతులు మాట్లా డితే .. బూతులతోనే సమాధానం చెబుతామని జగ్గారెడ్డి హెచ్చరించారు. రా జేందర్‌కు పదవి రాలేద న్న ఆవేదనలో సీఎంను పరుష పదజాలంతో తిడతావా? అని ప్రశ్నించారు. మేం తిడితే నీవు ఉరేసుకుని చస్తావ్? అని ఘాటుగా వ్యాఖ్యానించారు.