calender_icon.png 23 January, 2026 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపేక్షించేది లేదు

23-01-2026 01:25:52 AM

ధాన్యం దారిమళ్లిస్తే మిల్లర్లపై కఠిన చర్యలు

ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లలో తెలంగాణ రికార్డు: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి) : మిల్లర్లు ప్రభుత్వ మార్గదర్శ కా లు పాటించాల్సిందేనని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుకుం జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన వరి ధాన్యాన్ని దారి మళ్లిస్తే ఉపేక్షించేది లేదని మిల్లర్లను హెచ్చరించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠినంగా వ్యవహరిస్తామని, అటువంటి మిల్లుల విషయంలో నాయకులెవరైనా పైరవీలు చేసినా అధికారులు పట్టించుకోవద్దని మంత్రి సూచించారు. సర్కార్‌కు అనుగుణంగా నడుచుకునే మిల్లర్లను మరింత ప్రోత్సహిస్తామని, అవసరమైన ధాన్యం అదనంగా కేటాయిస్తామని తెలిపారు. 

సివిల్ సప్లు శాఖ ఆధ్వర్యంలో వానాకాలంలో ధాన్యం ఉత్పత్తి, కొనుగోలు, యాసంగిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం హైదరాబాద్‌లోని ఐఏఎస్ అధికారుల క్లబ్‌హౌస్‌లో జరిగిన సమావేశానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. అంతకు ముందు సివిల్ సప్లు శాఖ కమిషనర్ స్టీఫెన్వ్రీంధ్ర వానాకాలం సీజన్‌లో ధాన్యం ఉత్పత్తి, కొనుగోలు చేసిన అంశాలతో పాటు భవిష్యత్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ విధివిధానాలకు సంబంధించిన బ్రో చర్‌ను విడుదల చేశారు.

అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ  తెలంగాణ ధాన్యం దిగుబడిలోనే కాకుండా కొనుగోళ్లలోనూ దేశ చరిత్రలోనే రికార్డు సాధించిందని పేర్కొన్నారు. 2020 70.2 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు రికార్డును అధిగమంచి ఈ వానాకాలం సీజన్‌లో 71.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు చెప్పారు. అంతే కాకుండా సన్నాలకు మద్దతు ధరతో పాటు బోనస్ కలిపి 14.20 లక్షల మంది రైతులకు  రూ. 18,532 కోట్లు చెల్లించామని తెలిపారు. వానాకాలం సీజన్‌లో ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8,548 కేం ద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.  

రేషన్ బియ్యంతో పాటు నిత్యావసరాలు

రాష్ట్ర ప్రభత్వ ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుందని మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యంతో పాటు మరికొన్ని నిత్యావసర వస్తువులను అందజేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే రేషన్ బి య్యంతోపాటు ఉప్పు, పప్పులు, చింతపండు, గోధుమలు తదితర నిత్యావసర వస్తువులను అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు.

గతంలో రేషన్ షాపుల ద్వారా ప్రజలకు దొడ్డు బియ్యం పంపిణీ జరిగేదని, ఇప్పు డు ప్ర భుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడంతో రాష్ట్రంలోని 3.17 కోట్ల మంది (85 శాతం)కి పైగా ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. అందుకు ప్రభుత్వం రూ. 13,650 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపా రు.  రాష్ట్రానికి సరిపోయాక మిగిలిన బియ్యాన్ని ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేసేందుకు మిల్లులు ముందుకు వస్తే వారికి సహకరిస్తామన్నారు. 

ఆధునిక విధానంలో గోదాముల నిర్మాణం

రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి ఎక్కువగా ఉందని, నిల్వ చేయడానికి సరిపడా గోదాములు లేవని మంత్రి తెలిపారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో మొత్తం 29లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేయడానికి మాత్రమే గోదాములున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో ఆధునిక విధానంలో గోదాములు నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పాత టెక్నాలజీలో నిర్మించిన గోదాముల వల్ల ధాన్యం నిల్వ చేసినప్పుడు తరుగు రావడంతో ప్రభుత్వానికి నష్టం వస్తుందన్నారు. గోదాములు, మిల్లుల్లో కార్మికుల కొరత కూడా ఉందన్నారు. అందుకు గోదామలను నూతన టెక్నాలజీలో నిర్మిస్తే కొంత మేర కార్మికుల కొరతను అధిగమించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.