22-11-2025 06:16:42 PM
ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు..
వెంకటాపురం(నూగూరు) (విజయక్రాంతి): భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సహకారంతో నూగూరు వెంకటాపురం మండలంలోని మంగపేట రోడ్డులో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయానికి ధూప దీప నైవేద్య ఖర్చులు, నెలవారిగా గుడి మెయింటినెన్స్ కొరకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం అందించడం జరిగింది. ఎన్నో ఏళ్ళు తరబడి మారుమూల ప్రాంతమైన వెంకటాపురానికి ఇలాంటి ధూప, దీప నైవేద్యం కింద ప్రభుత్వం నిధులు అమలు చేయడం చాలా సంతోషకరంగా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సహాయ సహకారానికి కృషి చేసిన భద్రాచలం ఎమ్మెల్యేకి వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయంలో పూజలు నిర్వహించే పూజారికి నెలకు రూ.10,000లతో పాటు గుడి నిర్వహణకు అవసరమయ్యే ధూప దీప నైవేద్యాలకు మరికొంత మొత్తాన్ని దేవాదాయ శాఖ నుంచి ప్రతినెల అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తెలిపారు.