calender_icon.png 22 November, 2025 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనిటీ మార్చ్ కి ఎంపికైన నరెడ్ల ప్రవీణ్ రెడ్డి

22-11-2025 06:20:44 PM

ముకరంపుర (విజయక్రాంతి): ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం దేశం నలుమూలల నుండి ఎంపిక చేసిన యువ ప్రతినిధులతో ఈ నెల 23 నుంచి నవంబర్ 30 వరకు వారం రోజుల పాటు యూనిటీ మార్చ్ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి హుజురాబాద్ మండలం చిన్నపాపయ్య పల్లె గ్రామానికి చెందిన యువ నాయకుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ భారత ప్రభుత్వం తరపున కరీంనగర్ జిల్లా నుంచి యూనిటీ మార్చ్ కి ఎంపిక చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.