22-11-2025 06:18:40 PM
ముకరంపుర (విజయక్రాంతి): ఈనెల 28 నగరంలోని కళాభారతిలో నిర్వహించనున్న తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం ఆవిర్భావ రాష్ట్ర సదస్సుకు పోస్టర్ ను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మంత్రి క్వార్టర్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వలస సుభాష్ చంద్రబోస్, తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తాళ్ల పెళ్లిసంధ్య, కళాకారులు ఎద్దు మమత, కేశబోయిన రమ, ఈర్ల స్వాతి, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.