18 April, 2026 | 11:48 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

03-06-2025 01:14 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

 ఆమనగల్లు,జూన్ 2: రైతులకు నకిలీ విత్తనాలను విక్రయించే వారి పట్ల  ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆమనగల్ మండల కేంద్రంలో‘నాణ్యమైన విత్తనం- రైతన్నకు నేస్తం‘ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహిం చారు.

ఈ సందర్భంగా  ఆమనగల్ మండలం లో ని పది మంది రైతులకు 10 కేజీల వరి మినీ కిట్స్ ని వ్యవసాయ అధికారులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  రైతుల సంక్షేమంపై  ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. దానిలో భాగంగా మండలంలోని  రె వెన్యూ గ్రామంలో  ఎంపిక చేసిన ముగ్గురు రైతులకు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు.

ఫౌండేషన్ సీడ్ సాగు చేసిన అనంతరం  అట్టి సీడును వచ్చే సంవత్సరము ఆ విలేజ్ కి ఉపయోగపడే విధంగా చేయడము ముఖ్య ఉద్దేశం అన్నారు.కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ చైర్మన్ గీతా, ఏ డి ఏ కె శోభారాణి, ముఖ్య పరిశీలలుగా వచ్చిన శాస్త్రవేత్త డాక్టర్ కల్పన, వ్యవసాయ అ ధికారులు శ్రీనివాస్ గౌడ్, ఏఈవోలు, భూదేవి గాయత్రి, కేధర్ మీనాక్షి, నిఖితలు పాల్గొన్నారు.