calender_icon.png 10 January, 2026 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు

09-01-2026 12:31:56 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జనవరి 8: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్ హెచ్చరించారు. మూసి పరివాహక ప్రాంతమైన జాజిరెడ్డిగూడెం గ్రామ శివారులోని కేసారం గ్రామం వద్ద గురువారం ఇసుక ట్రాక్టర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక లోడింగ్ సమయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, క్వారీలోకి ఇసుక ట్రాక్టర్ల ఎంట్రీ,ఎగ్జిట్ వివరాలను సాండ్ ఆడిట్ మ్యాప్ లో నమోదు చేయాలని సూచించారు. వే బిల్లులు, డీడీల్లో తేడాలు ఉంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇసుక పన్ను విధానం ప్రకారం ఇసుక వాహనాల ఈ-వే బిల్లులను పరిశీలించి, ధ్రువీకరించారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.