calender_icon.png 11 January, 2026 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుద్ధి చెప్పి.. గడ్డి తింటారా..?

09-01-2026 12:32:57 AM

ఐరన్ లెగ్ రాహుల్ గాంధీ...

భాజపా కాంగ్రెస్ మిలాఖాత్ 

మీడియా సమావేశంలో కరీంనగర్ జిల్లా భారాస అధ్యక్షులు జీవి రామకృష్ణారావు

మానకొండూరు, జనవరి 8 (విజయక్రాంతి): రాహుల్ గాంధీ మెప్పు, రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ నాయకులు మితిమీరి కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని కరీంనగర్ జిల్లా భారాస అధ్యక్షులు జీ వి రామకృష్ణారావు మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలపై కేసీఆర్ ప్రశ్నించడమే పాపమా అని నిలదీశారు. రుణమాఫీ, కౌలు రైతులకు రూపాయలు15,000, భూమిలేని రైతులకు రూపాయలు 12,000 ఆర్థిక సాయం, రైతులకు ఇచ్చిన తదితర హామీలపై ప్రశ్నించడం తప్పేలా అవుతుందని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. 

వారి ఆరోపణలను దీటుగా ఖండించారు. ఘాటుగా సమాధానమిచ్చారు. నిండు సభలో కేసీఆర్‌ను ఉరితీయాలి అని వాఖ్యా నించడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వరాష్ట్రాన్ని సాధించి, నిధులు, నీళ్లు నియమకాలు చేపట్టినందుకా కేసీఆర్ ను ఉరితీయాలని వ్యంగంగా కాంగ్రెస్ నాయకులకు ప్రశ్నించారు. గురువారం మానకొం డూరులో మండ లాధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, పార్నంది కిషన్, శాతరాజు యాదగిరి, పిట్టల మధు, నెల్లి మురళి, బండ రాజశేఖర్, నెల్లి శంకర్ తదితరులు, పార్టీ శ్రేణులతో కలిసి రామకృష్ణారావు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇతరులకు బుద్ధి చెప్పి తాము గడ్డి తిన్నట్లుగా ఉందని కాంగ్రెస్ నాయకుల వ్యవహారశైలిని, భాష, వారి యాసను తీవ్రస్థాయిలో ఆక్షేపించారు.

రాహుల్ గాంధీతో కాంగ్రెస్ కనుమరుగవడం ఖాయమని ఆరోపించారు. అమూల్ బాయ్, ఐరన్ లెగ్ రాహుల్ కు ఏమి తెలుసని మీడియా సాక్షిగా సవాలు విసిరారు. కేసీఆర్ నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడని కేసీఆర్ ని విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. నేషనల్ హెరాల్డ్, బొగ్గు స్కామ్, కామన్ వెల్త్, తదితర స్కామ్‌లు ఎవరి హయాంలో జరిగాయో కాంగ్రెస్ నాయకులు గమనించాలని పరోక్షకంగా చురకలంటించారు. ఇకపై కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీపై అవాకులు చవాకులు, అర్ధరహిత విమర్శలు చేస్తే దెబ్బకు దెబ్బ పాలసీ అవలంబిస్తామని తేల్చి చెప్పారు.