calender_icon.png 21 September, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు

21-09-2025 06:12:42 PM

హుజురాబాద్ ఏసిపి మాధవి..

హుజురాబాద్ (విజయక్రాంతి): మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హుజురాబాద్ ఏసిపి వి మాధవి(ACP  Madhavi) హెచ్చరించారు. కరీంనగర్ సిపి గౌస్ ఆలం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఏసిపి మాధవి ఆధ్వర్యంలో ఆదివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 72 వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని సూచించారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారి తల్లిదండ్రులపై చట్ట ప్రకారంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. తల్లితండ్రులు వారి పిల్లల పై దృష్టి సారించాలని సూచించారు. వాహనాలకు నంబర్ ప్లేట్లు సరిగా అమర్చుకోవాలని అన్నారు. పెండింగ్ చలాన్లు వెంటనే చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.