calender_icon.png 21 September, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేండి వాగుకు వరద నీరు..

21-09-2025 06:16:10 PM

గోజేగావ్ గ్రామానికి నిలిచిపోయిన రాకపోకలు..

మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎగువ మహారాష్ట్ర నుండి పారే లేండి వాగుకు భారీగా వరద నీరు పారుతుంది. వరదనీటి మూలంగా మద్నూర్ మండలంలోని గోజేగావ్ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ గ్రామం లెండి వాగు ఆవుతలి ఒడ్డున ఉన్నందున ఎప్పుడు వరదలచ్చిన ఈ గ్రామ ప్రజలకు రాకపోకలు నిలిచిపోతాయి. ఎందుకంటే లేండి వాగుకు ఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో ఓవర్ బ్రిడ్జి ఉన్నందున భారీగా పారే వరద నీటితో రాకపోకలు నిలిచిపోవడం జరుగుతుంది. వర్షాకాలంలో ఈ ప్రాంతంలో వర్షాలు పడకపోయినా మహారాష్ట్ర ప్రాంతంలో కురిసే వర్షాలకు ఎగువ నుండి పారే లేండి వాగుకు భారీగా వరద వస్తుంది. వరద నీరు ఎప్పుడు వచ్చినా మండలంలోని గోజేగావ్ ప్రజలకు రాకపోకలు నిలిచిపోయి అవస్థలు ఎదుర్కొంటారు. లేండి వాగు పైన ఓవర్ బ్రిడ్జ్ నిర్మించే వరకు ఈ గ్రామ ప్రజలు అవస్థలు పడకతప్పదు.వాగుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి రాకపోకలు నిలిపివేసినట్లు తహశీల్దార్ ఎండీ ముజీబ్ తెలిపారు. వాగు ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకూడదని తహశీల్దార్ సూచించారు.