calender_icon.png 27 November, 2025 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

27-11-2025 12:19:49 AM

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని 

యాదాద్రి భువనగిరి నవంబర్ 26 ( విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని తెలిపారు. బుదవారం హైదరా బాద్ నుండి రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్‌లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ఆదేశాలు, సూచలను జారీచెశారు.

ఈ సంద ర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ మాట్లాడుతూ,  రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలను డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండవ విడత,  డిసెంబర్ 17న మూడవ విడత పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు సంబం ధించి అప్ డేట్ చేసిన రిజర్వేషన్లు, పోలింగ్ దశ, పోలింగ్ కేంద్రాల జియో లోకేషన్ వివరాలు టి-పోల్ వెబ్ సైట్ లో నవీకరించాలని తెలిపారు.

టి-పోల్ వెబ్ సైట్ ద్వారా వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాలో నోడల్ అధికారిని నియమించా లని, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఫిర్యాదు లను మూడు రోజులలో పరిష్కరించాలని అన్నారు. పొలింగ్ క్రేంద్రాల జాబితా, డిజిటల్ వివరాలను  టి పోల్ లో నమోదు చేయాలని,  పోలింగ్ కేంద్రాలలో  లైట్, పవర్, ర్యాంప్, ఫర్నిచర్, భద్రతను చూసుకోవాలని, 2 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న భవనం దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని,

వెబ్ క్యాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల వివరాలు పంపాలని, డిస్ట్రిబ్యుషన్ కేంద్రాలు మండల కేంద్రాలో ఉండాలని,  ఒట్ల లెక్కంపు కొరకు స్ట్రాంగ్ రూంలను 3 రోజుల ముందుగా సిద్దం చేసుకోని ఏర్పాట్లను పర్యవేక్షించుకోవాలని సూచించారు. నవంబర్ 27  నుంచి నవంబర్ 29 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని. పంచాయతీ ఎన్నికలకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. 

ఎం.సి.సి అమలులో నిర్వహించే తనిఖీల లో  నగదు,  బంగారం, ఇతర పరికరాలు సీజ్ చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు అందించాలని, సీజ్ చేసిన పరికరాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించేం దుకు ఏ అధికారి ముందు హాజరు కావా లని వివరాలు ఆ రసీదులో ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణ పై  జిల్లా కలెక్టర్ ఎలక్షన్ కమీషనర్ కు వివరిస్తూ మొదటి దశ ఎన్నికల నిర్వహణ  సాఫీగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.

రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు పునచరణ శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. నామినేషన్ ప్రక్రియకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టి  బృందాలను నియమించడం జరిగిందని , మొదటి విడత నామినేషన్ల స్వీకరణ సందర్భంగా పూర్తి సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు నోడల్ ఆఫీసర్ లు, ఎంపీడీఓ  పాల్గొన్నారు