calender_icon.png 14 August, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాల నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకోవాలి

14-08-2025 07:57:09 PM

జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..

హనుమకొండ (విజయక్రాంతి): రాష్ట్రంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు జిల్లా కలెక్టర్లు యుద్ధ ప్రాతిపదికన అప్రమత్తంగా ఉండాలని అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో తెలిపారు. అధికారులు తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు యూరియా నిల్వలు, వరదల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లాకు కోటి రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.

మరిన్ని నిధులు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని, వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని కోరారు. పోలీసు యంత్రాంగం సహకారం తీసుకోవాలని కోరారు. సిఎస్ కె. రామకృష్ణారావు మాట్లాడుతూ, జిల్లాలలో అప్రమత్తంగా ఉండి అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ల వద్ద ఉన్న డిజాస్టర్ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాగులు, చెరువులు, కల్వర్టెల్ వద్ద ప్రమాదాలను నివారించాలని, నియంత్రణ చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు అప్రమత్తంగా బందోబస్తు చర్యలను చేపట్టాలని అన్నారు.