25-09-2025 12:06:01 AM
ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్గగొండ క్రైం, సెప్టెంబర్ 24: జిల్లాలో దొంగతనాలు జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేసి నిరంతర గస్తీ కోసం ప్రత్యేక బృందాలతో పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు సొంత గ్రామాలకు, విహారయాత్రకు వెళ్లే వారు అప్రమ త్తంగా ఉండాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో, కాలనీల్లో ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు అనుమానిత వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండి సమాచారాన్ని పోలీస్ స్టేషన్ కి అందించాలన్నారు.
విలువైన వస్తువులు బంగారం, నగదు బ్యాంక్ లాకర్ లో బద్రపరచడం, ఇంటి డోర్ కి సెంట్రల్ లాకింగ్ వాడటం, సుదూర ప్రాంతాలకు వెళ్లే పట్టణ, గ్రామంలోని ప్రజలు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ముందుగానే తెలియజేస్తే అక్కడ పోలీస్ నిఘా ఏర్పాటు చేస్తా రని, ఇంటికి,షాపులు, కాలనీలు, పరిసరాలు, షాపింగ్ మాల్స్ హై క్యాలిటి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
దొంగతనం చేయుటకు ఉపయోగించే వస్తువులు ఇనుప రాడ్లు, స్క్రూ డ్రైవర్ లాంటి ఇతర పరికరాలను దొంగలకు కనపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటివద్ద వృద్ధులు, మహిళలు, పిల్లల ఉన్న సమయంలో ‘అపరిచితులు‘ వచ్చి చెప్పే మాటలు నమ్మొద్దు అన్నారు అత్యవసర సమయంలో 100 నెంబర్ కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.