25-09-2025 12:06:21 AM
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో నియర్ బై లొకేషన్ తో ఇందిరమ్మ ఇళ్ల సమస్య పరిష్కారం అవుతుందని కాంగ్రెస్ పార్టీ మరిపెడ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీర్ రెడ్డి అన్నారు. బుధవారం భూక్యతండ గ్రామపంచాయతీ నందు ధరావత్ నాగమణి కు ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లకు లొకేషన్ తప్పుగా అప్లోడ్ అయినవాటికి బేస్మెంట్ ఫోటో తీసుకోవట్లేదని స్వయంగా భూఖ్య తండకు వెళ్లి నియర్ బై లొకేషన్ తో ఇందిరమ్మ ఇండ్ల యజమాని నాగమణి సమస్య పరిష్కరించడం జరిగింది.