calender_icon.png 13 May, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాజరు శాతం లేదని ఫీజు కట్టించలే....!

05-03-2025 10:40:57 AM

ఇంటర్ పరీక్షలకు అర్హత కోల్పోయిన విద్యార్థి

నాగర్ కర్నూల్ పట్టణంలోని రవితేజ జూనియర్ కళాశాల యాజమాన్యం నిర్వాకం. 

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి ఇంటర్(TS Inter exam 2025) పరీక్షలకు దూరమయ్యాడు. హాజరుశాతం సరిగ్గా లేదనే సాకు చూపి ఇంటర్ పరీక్షకు ఫీజు చెల్లించకపోవడంతో ఈ ఏడాదంతా విద్యార్థి విద్యకు దూరమయ్యాడు. ఇదేంటి అని అడిగిన తల్లిదండ్రులపై కస్సు బస్సు అంటూ కళాశాల ప్రిన్సిపల్  చిందులేసాడు. వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం గడ్డంపల్లి గ్రామానికి చెందిన ఓ ఇంటర్ స్టూడెంట్ జిల్లా కేంద్రంలోని రవితేజ జూనియర్ కళాశాలలో(Raviteja Junior College) చదువుతున్నాడు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా కళాశాలకు సక్రమంగా హాజరు కాలేకపోయాడు. దాన్ని అలుసుగా తీసుకొని యజమాన్యం ఆ విద్యార్థికి ఇంటర్ పరీక్షలకు ఫీజు చెల్లించకపోవడంతో ప్రస్తుతం హాల్ టికెట్ అందక బుధవారం నుంచి జరుగుతున్న ఇంటర్ పరీక్షలకు దూరమయ్యాడు. ఇదే విషయంపై బాధిత విద్యార్ధి తల్లిదండ్రులు కళాశాలకు చేరుకొని సంబంధిత ప్రిన్సిపల్ శ్రీనివాసులుని ప్రశ్నించగా వారిపై చిందులు వేస్తూ ఫీజు చెల్లించలేదని దబాయించాడు. ఇదే విషయంపై ఇంటర్ నోడల్ అధికారి(Inter Nodal Officer) వెంకటరమణ స్పందిస్తూ సమస్య తన దృష్టికి వచ్చిందని విద్యార్థి అడ్మిషన్ జరిగిన తర్వాత ఫీజు చెల్లించాల్సిన బాధ్యత సంబంధిత కళాశాల యాజమాన్యంపైనే ఉంటుందని సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులను వివరణ కోరెందుకు ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాకపోవడం విశేషం.