హనుమకొండ: ఒకే ఊరు వాళ్లమని స్నేహం చేయడమే ఆ అమ్మాయి పాలిట శాపమైంది. వరంగల్ లో సెప్టెంబర్ 15న జరిగిన ఈ దారుణ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లికి చెందిన ఓ అమ్మాయి హాస్టల్ లో ఉంటూ వరంగల్ శివారులోని ఓ కాలేజీలో ఫార్మాడీ చదువుతోంది. భూపాలపల్లికి చెందిన ఇద్దరు అబ్బాయిలు స్థానికంగా ఉంటూ అదే కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. ఒకే ఊరోళ్లు కావడంతో ముగ్గురు ప్రెండ్స్ అయ్యారు. అనంతరం సరదగా బయటకు తిరిగోద్దామని అమ్మాయికి చెప్పిన బీటెక్ విద్యార్థులు కారులో తీసుకుపోయారు. వరంగల్ లో ఓ లాడ్జిలో రెండు రూంలు తీసుకుని అమ్మాయికి ఒక గది వీళ్లకి ఒక గది తీసుకున్నారు. వారి గదిలో మద్యం సేవించిన యువకులు అమ్మాయి గదిలోకి వెళ్లి ఆమెకు బలవంతంగా బీర్లు తాగించి మత్తులో ఉండగా అత్యాచారం చేశారు. కాగా, విద్యార్థిని జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.