15-11-2025 05:25:38 PM
- ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
- ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కుల పంపిణీ
రాజన్న సిరిసిల్ల: పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేములవాడ పట్టణ పరిధిలోని అర్హులైన 19 మంది లబ్ధిదారులకు 07 లక్షల విలువ గల, రూరల్ మండల పరిధిలో అర్హులైన 10 మంది లబ్ధిదారులకు 03 లక్షల 48 వేల విలువ గల, అర్బన్ మండల పరిధిలో 6 లక్షల విలువ గల 16 ముఖ్యమంత్రి సహయనిది చెక్కులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అందులో భాగంగా మహిళ ప్రజలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 సిలిండర్, రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.
మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా, ఎల్ఓసి ల ద్వారా ఇప్పటి వరకు 20 కోట్లపై చిలుకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. పేదలకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 10 సంవత్సరాలలో 400 కోట్లు పంపిణీ చేస్తే ప్రజా ప్రభుత్వ ఏర్పడిన నాటినుండి నేటి వరకు 800 కోట్ల మేర లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య రూరల్ మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.