calender_icon.png 15 November, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్తీక మాసం భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

15-11-2025 05:17:00 PM

అధికారులు పర్యవేక్షణ..

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): జిల్లాలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ముగుస్తున్న సందర్భంగా భారీగా భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పలు చర్యలు చేపట్టారు. ఆలయ ఈవో రమాదేవి, పట్టణ సీఐ వీర ప్రసాద్ కలిసి ఆలయ పరిసర ప్రాంతాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. కోడె క్యూలైన్, ఉచిత దర్శనం, రూ.300 ప్రత్యేక దర్శనం, లడ్డు కౌంటర్, ప్రోటోకాల్ ఆఫీస్ వంటి ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా అనే విషయంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపారు. పర్యవేక్షణ కార్యక్రమంలో ఎస్సై ఎల్లా గౌడ్, డి.ఈ. రఘునందన్, ఏ.ఈ.ఓ శ్రావణ్ కుమార్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.