17-11-2025 07:26:55 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): కారు ఆటోకు తగలడంతో కారులో ఉన్న వ్యక్తులపై కత్తితో దాడికి ప్రయత్నించిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు బెల్లంపల్లి రూరల్ సీఐ హనూక్ సోమవారం తెలిపారు. నెన్నల్ మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కోడిప అశోక్ తన టీఎస్ 01 యు బి 6211 ఆటోలో నెన్నల్ నుండి జోగాపూర్ కు వెళుతుండగా ఘనపూర్ గ్రామం వద్ద గల స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎదురుగా వస్తున్న టీజీ 24 02 03 నెంబర్ గల టాటా పంచ్ కారు చిన్నగా ఢీకొట్టింది. దీంతో ఆటో నడుపుతున్న కోడిపే అశోక్ ఆటో సీటు కింద ఉన్న కత్తి తీసి కారు నడుపుతున్న చీర హరీష్ కడుపులో పొడవడంతో కింద పడిపోయాడు.
కారులో ఉన్న చీరల సురేష్ ను కూడా పొడిచేందుకు ప్రయత్నించాడు. కారు దిగి పారిపోతున్న పత్తి రెడ్డి అఖిల్ , చీర్ల సురేష్ లను గ్రామస్తులు కాపాడారు. నిందితుడు అశోక్ గ్రామస్తులను చూసి పారిపోయాడు. గాయపడ్డ చీర్ల హరీష్ ను ప్రభుత్వ దావకానకు తరలించారు. కత్తితో దాడి చేసిన అశోక్ పై బాధితుడు చీర్ల సురేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సోమవారం నిందితుడు చిత్తపూర్ గ్రామ మామిడి తోటలో ఉన్నట్లు సమాచారం అందడంతో పట్టుకున్నట్లు సిఐ హనూక్ తెలిపారు. నిందితుడు కోడిప అశోక్ సహకరించిన మరొక ఆటో డ్రైవర్ సిందం అంజితో పాటు అన్న కోడిప రాజుపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుల ఆటోతో పాటు కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ హనూక్ తెలిపారు.