calender_icon.png 28 October, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్జాతీయ కూచిపూడి నృత్య పోటీల్లో పారమిత విద్యార్థుల ప్రతిభ

28-10-2025 06:35:10 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): ఇటీవల అంతర్జాతీయ కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నృత్య పోటీలలో పారామిత హెరిటేజ్ పాఠశాల విద్యార్థులు ప్రతిభను కనబరిచి అవార్డులను కైవసం చేసుకున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ తెలిపారు.

ఈ నృత్య పోటీలలో యస్.అక్షయ సాయి, యం.స్నేహారెడ్డి, యన్.అద్వైత, యం.ప్రణవసాయి,  హంసికా యాదవ్, సి.హెచ్.హనీష, వి.సాకేత్, అశ్విక్ యాదవ్ ప్రతిభను కనబరిచి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, కాశీ విశ్వనాథ ఆలయం, అంతర్జాతీయ కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ డ్యాన్సర్స్ అసోసియేషన్, నోబుల్ వరల్డ్ రికార్డ్, భుప్లాస్ వరల్డ్ రికార్డుల నుండి ప్రశంసా పత్రాలు, మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ సాధించారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులను పారమిత విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఇ.ప్రసాదరావు, డైరెక్టర్లు రశ్మిత, ప్రసూన,అనూకర్ రావు, రాకేష్, వి.యు.యం. ప్రసాద్, వినోద్ రావు, హన్మంత రావు, ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ, కోఆర్దినేటర్లు రాము, నాగరాజు, నాట్యాచార్యులు వి.రంగాచార్యులు అభినందించారు.