calender_icon.png 28 October, 2025 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో చిట్యాల మండల నాయకులు

28-10-2025 06:37:17 PM

చిట్యాల (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ఎన్నికల ప్రచారంలో చిట్యాల మండల నాయకులు పాల్గొన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బూత్ నం.97లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ కి మద్దతుగా ఎమ్మెల్యేతో కలిసి చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

నవంబర్ 11న జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పైన ఓటు వేసి నవీన్ యాదవ్ ని భారీ మెజారిటితో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనరసింహ, టౌన్ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాటం వెంకన్న, మండల మాజీ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు అద్దెల లింగారెడ్డి, మాజీ సర్పంచ్ జనగం రవీందర్ గౌడ్, నాయకులు, డివిజన్ నాయకులు, మహిళా కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.