calender_icon.png 8 September, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

274 మంది స్టూడెంట్స్.. నలుగురు టీచర్స్

08-09-2025 01:50:31 AM

విద్యార్థులను వేధిస్తున్న టీచర్ల కొరత 

పరిష్కారం చూపాలంటూ విద్యార్థుల ఆవేదన

అలంపూర్, సెప్టెంబర్ 07 :తరగతి గదిలోనే విద్యార్థుల యొక్క భవిష్యత్తు రూపు దిద్దుకుంటుంది అంటారు కానీ తరగతి గదుల్లో విద్యార్థులు ఉన్నా ...విద్యను అం దించే గురువులే కరువయ్యారు.దీంతో టీచర్ల కొరత కారణంగా వారి యొక్క చదువులు ఆగం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. వి ద్యార్థుల సంఖ్యకు సరిపడ టీచర్లు లేక వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది.ఇలా గద్వాల జిల్లా ఉండవల్లి మండలం బొం కూరు గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పడిన పరిస్థితి.దాదాపు ఈ పాఠ శాలలో అన్ని తరగతులను కలుపుకుని 274 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నా రు.

కానీ వారికి కేవలం నలుగురు టీచర్లు బోధిస్తున్నారు.గణితం, బయో సైన్సు ,సోష ల్, వంటి ప్రధాన సబ్జెక్టులను బోధించేందుకు టీచర్లు లేక విద్యార్థులు ఆయా సబ్జె క్టులపై ఆదిలోనే పట్టు తప్పే పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు వాపోయారు. ఒకపక్క ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామ ని చెబుతున్నప్పటికీ... కనీసం టీచర్ల కొరతను తీర్చి మా చదువులు సవ్యంగా సాగేం దుకు చొరవ తీసుకోవాలని అధికారులను విద్యార్థులు వేడుకుంటున్నారు.

అయితే ఈ పాఠశాల 2017 సంవత్సరంలో పదవ తరగతి వరకు అప్ గ్రేడ్ అయ్యిందని ప్రతి ఏటా స్కూల్ ప్రారంభంలో డిప్యూటేషన్ పై టీచర్లు వచ్చేవారని ఈ ఏడాది సెప్టెంబర్ నెల వచ్చిన డిప్యూటేషన్ పై టీచర్లు రాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. సంబంధిత విద్యాశాఖ అధికారులు ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.

రెండు నెలల నుంచి చెబుతున్నారు 

స్కూల్లో టీచర్లు కొరత కారణంగా విద్యార్థుల చదువుకు ఆటంకంగా మా రింది. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు ప్రధాన సబ్జెక్టులైనా గణితం సోషల్, బయోసైన్స్ టీచర్లు లేక సబ్జెక్టులపై విద్యార్థులు పట్టు తప్పే పరిస్థితి నెలకొంది. ఇట్టి విషయమే సంబంధిత అధికారులకు విన్నవించగా....

రెండు నెలల నుంచి టీచర్లను నియమిస్తామం టూ కాలయాపన చేస్తున్నారు. విద్యార్థులు చదువులు దృష్టిలో పెట్టుకుని అధికారులు స్పందించి టీచర్ల కొరతను తీర్చాలని కోరుతున్నాము.

 భరత్ రెడ్డి, బొంకూరు గ్రామం 

రెండు రోజుల్లో టీచర్లను నియమిస్తాం 

ఉపాధ్యాయుల కొరత వాస్తవమే. సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి టీచర్లను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రెండు రోజుల్లో టీచర్లను నియమిస్తాం.

శివ ప్రసాద్ ఇంచార్జి ఎంఈఓ మానవపాడు