calender_icon.png 16 August, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి

13-08-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

వేములవాడ టౌన్ ఆగస్టు 12 (విజయక్రాంతి): విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. వేములవాడ మున్సిపల్ ప రిధిలోని మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ గరల్స్ విద్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్ స్టోర్ రూమ్ లలో తిరిగి, స్వయంగా గరిటతో వంటకాలను కలిపి వాటి నాణ్యతను, ల్యాబ్, లైబ్రరీ, ఆట స్థలమును పరిశీలించారు.

వి ద్యార్థులతో హాస్టల్ వసతులు నాణ్యమైన భోజనం పెడుతున్నారా? అనిcవిద్యార్థులను సౌకర్యాలు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం విద్యాలయంలోని 9,10, ఇంట ర్మీడియట్ విద్యార్థులకు ఫిజిక్స్, మ్యాథ్స్ ఎకనామిక్స్, ఇంగ్లీష్ పాఠాలను బోధించి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.

కొందరు టీచర్లు విద్యార్థులకు సక్రమంగా పాఠాలు బోధించలేకపోవడం గమనించి, సూచనలు చేసి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. క్లాస్ రూమ్ కి వెళ్లే ఉపాధ్యాయులు ముందుగా సంబంధిత సబ్జెక్టు పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులకు సక్రమంగా పాఠాలు బోధించాలని ఆదేశించారు. దీంతో విద్యార్థులకు సబ్జెక్ట్ పై పూర్తి స్థాయిలో పట్టు వస్తుందని తెలిపారు.

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని సూచించారు. పాఠశాలకు అవసరమైన 30 బెంచీలను ఇతర విద్యాలయాల నుండి తెప్పించవలసిందిగా, ప్రతినిత్యం జిల్లా విద్యాధికారి తనిఖీలు నిర్వహించవలసిందిగా డి.ఈ.ఓ ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్యామల, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.