08-09-2025 12:01:37 AM
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
ఎల్లారెడ్డి సెప్టెంబర్ 7 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 15న జరగనున్న బీసీ డిక్లరేషన్ సభను బీసీలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు.
ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ డిక్లరేషన్ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క తో కలిసి సభ ఏర్పాట్ల గురించి చర్చించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్రావు మాట్లాడుతూ.. ఈనెల 15న బిసి డిక్లరేషన్ సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ కర్గే, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని అన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర మోకాలు అడ్డుతుందని విమర్శించారు. 15న జరిగే బీసీ సభ ద్వారా బీసీల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని, ప్రతిపక్షాల తీరును ఎండగడతామని అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు