24-08-2025 12:00:00 AM
ఆక్స్ ఫర్డ్ గ్రామర్ హైస్కూల్ డైరెక్టర్ మణికొండ ప్రార్థన
ముషీరాబాద్, ఆగస్టు 23(విజయక్రాం తి): విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకొని నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని ఆక్స్ ఫర్డ్ గ్రామర్ హైస్కూల్ డైరెక్టర్ మణికొండ ప్రార్థన అన్నారు. హిమాయత్ నగర్ లోని ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్ ఆవరణలో షార్క్ ట్యాంక్ కార్య క్రమం జరిగింది. న్యాయ నిర్ణేతలు మీర్ అలీ, డాక్టర్ సౌజన్య, కమల్ కృష్ణన్ వ్యవహరించారు.
రోజువారి సమస్యల పరిష్కారం నుంచి సాంకేతిక పురోగతి వరకు విన్నూత ఆలోచనలను షార్క్ ట్యాంక్ విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కట్టా ప్రభాకర్, డీన్ రామాంజుల, ప్రిన్సిపాల్ సి.హెచ్.రేఖారావు, ప్రతినిధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.