23-08-2025 11:47:04 PM
ఇబ్రహీంపట్నం: గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలనీ మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని శాస్త్ర గార్డెన్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని గణేష్ మండప నిర్వహకులు, కాలనీవాసులతో అవగాహన, సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి హాజరై మాట్లాడుతూ.. గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి గొడవలు, ఆటంకాలు లేకుండా జరుపుకోవాలని అన్నారు. రాత్రి సమయంలో మండపం నిర్వాహకులు మండపం వద్దనే పడుకోవాలని, డీజే లు ఎక్కువ సౌండ్ లో పెట్టీ ఇతరులు ఇబ్బంది కల్పించకూడదని, నిమజ్జనం సమయంలో పెద్ద పెద్ద వెహికల్స్, కంటైనర్స్ పెట్టరాదని సూచించారు.