29-11-2025 12:00:00 AM
ఎల్లారెడ్డి, నవంబర్ 28 (విజయక్రాంతి): విద్యార్థులు చలికాలంలో వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎల్లారెడ్డి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పలువురికి ఉచితంగా మందులు అందజేశారు. ప్రతిరోజు స్నానం చేయాలని, శుభ్రమైన, ఎండలో ఆరేసిన దుస్తులు వేసుకోవాలని సూచించారు. విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజన వంటలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపల్ బాలరాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ గోవింద్ రెడ్డి, హెచ్‌ఈ ఓ జనార్దన్ రెడ్డి, ఏఎన్‌ఎం ఇందిరా, సంయుక్త, ఆశవర్కర్ లావణ్య, ఉపాధ్యాయులు మంజూర్ ఖాన్, ప్రవీణ్ కుమార్, ఖాజా, దత్తాత్రేయ, శివ ప్రసాద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.