calender_icon.png 29 November, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ తనిఖీ

29-11-2025 12:00:00 AM

ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం, నవంబరరు 28 (విజయక్రాంతి): ఎన్నికల నిబంధనల ప్రకారం అప్ర మత్తంగా ఉంటూ విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు అన్నా రు. శుక్రవారం రఘునాథపాలెం మండలంలో మొదటి విడత గ్రామ పంచాయతి ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి ఎన్నికల సాధారణ పరిశీలకులు పరిశీలించారు.

చిమ్మపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోటపాడు, చిమ్మపూడి, కోయచెలక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రేగులచెలక, కోయ చెలక, శివాయిగూడెం  గ్రామాల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. అభ్యర్ధులు దాఖలు చేసిన నామినేషన్ ప్రతాలను పరిశీలించారు. ఎన్నికల విధులు, బా ధ్యతల పట్ల సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.ఈ సందర్భంగా ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో నామినేషన్లు చాలా ముఖ్యమైన ఘట్టమని, నామినేషన్ పత్రాలలో ప్రతి అంశం సరిగా ఉన్నాయో, లేవో జాగ్రత్తగా నిబంధనల ప్రకారం చూడాలని తెలిపారు.

కలెక్టర్  అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నా మినేషన్ కు విధిగా కొత్త బ్యాంక్ ఖాతా తీసుకునే విధంగా వారికి తెలియజేయాలని సూ చించారు. ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ఒరిజినల్ పత్రాలను సంబంధిత గ్రా మ పంచాయతీలలోని ఆర్వో ల వద్ద పొందవచ్చని తెలిపారు. వార్డు సభ్యుడు పోటీ కో సం అదే వార్డు సభ్యుడు ప్రపోజర్ గా ఉం డాలని అన్నారు. సర్పంచ్ గా పోటీచేసే అభ్య ర్థి డిపాజిట్ క్రింద  కేటగిరి వారిగా  చెల్లించాలని, ఏమైనా అప్పీల్ ఉంటే ఆర్డీవోను సంప్రదించాలని సూచించారు.

నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులకు సంబంధించిన కర పత్రాలు, గోడపత్రాలు, ప్రచార వాహనాల అనుమతులను తీసుకోవాలంటే సంబంధిత మండల అధికారులను సంప్రదించాలని తెలిపారు.గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యుల నామినేషన్ దాఖలును రోజు వారిగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు.

అభ్యర్థుల యొక్క అన్ని వివరాలు నామినేషన్ పత్రాలలో పూర్తిగా నమోదు చేసేందుకు అవగాహకు హెల్ప్ డెన్స్ లో నివృత్తి చేసుకోవచ్చని,  ప్రతి చిన్న అంశాన్ని, అనుమానాలకు తావులేకుండా పూర్తి స్థాయి లో తెలుసుకోవాలని వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించుటకు అధికారులు సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.సాధారణ ఎన్నికల పరిశీలకులు, కలె క్టర్ వెంట రఘునాథపాలెం మండల తహసీల్దారు శ్వేత, లింగనాయక్ ఎన్నికల రిటర్నిం గ్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.