08-08-2025 04:25:05 PM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం..
నకిరేకల్ (విజయక్రాంతి): ప్రతి విద్యార్థి ఎంచుకున్న లక్ష్యం కోసం అహర్నిశలు కృషి చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham) కోరారు. శుక్రవారం కేతేపల్లి మండలం రాయపురం గ్రామంలో సెయింట్ ఆన్స్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యం కోసం కృషి చేసినప్పుడే సరైన ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు. ఆదిశగా ప్రతి విద్యార్థి అడుగులు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుత్తామంజులమాధవ్ రెడ్డి,మాజీ యం.పి.టి.సి బొజ్జ సుందర్, కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.