08-08-2025 04:37:19 PM
మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ. యాకూబ్ పాషా..
కొత్తగూడెం (విజయక్రాంతి): సింగరేణిలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, డిప్లొమా అప్రెంటిస్‌షిప్ కొరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగుస్తున్నందున ఆసక్తి గల అభ్యర్థులు నేటి సాయంత్రం 5 గంటల లోపు www.nats.education.gov.in, www.scclmines.com/apprenticeship వెబ్సైట్ నందు ఆన్లైన్ చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ. యాకూబ్ పాషా(State Chief Secretary Md. Yakub Pasha) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర సమాచారం కోసం 8520860785 నంబరుకు సంప్రదించాలన్నారు.