calender_icon.png 25 July, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్టడీ టూర్లు

13-12-2024 02:16:51 AM

  • త్వరలో మండలి, అసెంబ్లీ కమిటీలు పూర్తి
  • శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
  • భవిష్యత్తులోనూ అవగాహన సదస్సులు
  • అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్
  • ఓరియంటేషన్ క్లాసుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మంత్రులు 

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): ప్రభుత్వం సహకరిస్తే త్వరలోనే అసెంబ్లీ, శాసనమండలి అన్ని కమిటీలను పూర్తి చేస్తామని.. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్టడీ టూర్‌లు ఏర్పాటు చేస్తామని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేం దర్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభ కార్య విధానం, కార్యక్రమ నిర్వహణ నియమావళిపై ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు జూబ్లీహిల్స్ లోని ఎంసీమెచ్‌ఆర్డీలో ఏర్పాటు చేసిన రెండు రోజుల అవగాహన సదస్సు గురువారంతో ముగిసింది.

ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభు త్వం కొత్త సంప్రదాయనికి నాంది పలికిందన్నారు. ఎమ్మెల్యేలు,- ఎమ్మెల్సీలకు లేజి స్లేచ ర్ విధివిధానాలపై అవగాహన కార్యక్రమా లు నిర్వహించిందని.. ఇలాంటి కార్యక్రమా లు భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామన్నారు. 

స్వరాష్ట్రంలో మొదిటిసారి: స్పీకర్ ప్రసాద్‌కుమార్

తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత మొదటిసారి అధికారికంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ తెలిపారు. శాసన వ్యవహారాలు తెలుసుకునేందుకు సభ్యులు హాజరుకావడం సంతో షాన్నిచ్చిందన్నారు. రెండు రోజుల ఓరియంటేషన్ ప్రోగ్రాం ద్వారా శాసన పరిషత్తు, శాసనసభలో సభ్యులు తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకున్నారన్నారు.

ఈ విషయాలను వచ్చే సమావేశాలలో అమలు చేయడం ద్వారా మంచి పేరుతోపాటు, గౌరవం పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సదస్సులు నిర్వహి స్తామన్నారు. ఎమ్మెల్యేలకు క్రీడలు నిర్వహణ, స్టడీ టూర్ వంటి కార్యక్రమాలు ఉం టాయన్నారు. అవగాహన కార్యక్రమంలో శిక్షణ ఇచ్చిన పీఆర్‌ఎస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నిర్వహణకు సహకరించిన ఎంసీహెచ్‌ఆర్‌డీ అధికారులు, సిబ్బందికి, సదస్సును విజయవంతం చేసిన లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహాచార్యులుకు స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు. 

సభ విలువలు కాపాడాలి: మంత్రి పొన్నం 

సభలో వివిధ ప్రజా అంశాలు చర్చకు రావాలని, సభ విలువలను కాపాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శాసనసభ, శాసన మండలిలో సమర్థవంతంగా ప్రజల అంశాలు చర్చకు రావాలన్నారు. ఏ ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు ఎన్నికయ్యాయో అది నెరవేరే విధంగా ఈ శిక్షణ తరగతులు జరిగాయన్నారు. శాసనసభ ప్రజాస్వామ్య విలువలకు వేదిక అని అన్నారు.

ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రు లు శ్రీధర్‌బాబు, పొంగులేటి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్,  ప్రభుత్వ సలహాదా రుడు వేం నరేందర్‌రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ చైర్మన్ ప్రకాశ్, ఎంసీహెచ్‌ఆర్డీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశాంక్ గోయల్, 17 మంది ఎమ్మెల్సీలు, 61 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.