calender_icon.png 26 July, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్ట్ ఆరంభం రోజే కస్టమర్‌కు షాక్

13-12-2024 02:20:45 AM

* ప్రకటించిన ధర కంటే గోధుమలకు ఎక్కువ ధర వసూలు

* పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం నేషనల్ మార్ట్ ప్రారంభమైంది. ఓ వినియోగదారుడు గోధుమలు కొనుగోలు చేయగా, మార్ట్‌లో ప్రకటించిన ధర కంటే ఎక్కువ బిల్లు వచ్చింది. దీంతో వినియోగదారుడు షాక్ అయి, సిబ్బందిని నిలదీశాడు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయం గురువారం వెలుగులో కి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకేంద్రానికి చెందిన హజ్మత్ నేషనల్ మార్ట్‌కు వెళ్లాడు. మార్ట్‌లో గోధుమలు కిలో రూ.41 చొప్పున అందిస్తామనే బోర్డు చూసి, హజ్మత్ ఏడు కిలోల గోధుమలు తీసుకున్నాడు.

రూ.287 చెల్లించేందు కు సిద్ధమయ్యాడు. బిల్లు వేసే క్రమంలో సిబ్బంది రూ.434 చెల్లించాలని సూచించడంతో అవాక్కయ్యాడు. అదేంటని సిబ్బంది ని ప్రశ్నించగా, కిలోకు రూ.61 చొప్పున చెల్లించాలని సమాధానమిచ్చాడు. బోర్డుపై కిలోకు రూ.41 చొప్పున రాసి ఉందని చెప్పగా, సిబ్బంది గుడ్లు తేలేసి సిస్టమ్ అప్‌డేట్ కాలేదని సమాధానమిచ్చారు. దీంతో హజ్మత్ పోలీసులను ఆశ్రయించాడు.