calender_icon.png 26 July, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేనకోడలి పుట్టినరోజు వేడుకలో భార్యను హత్య చేసిన భర్త

25-07-2025 08:45:43 AM

హైదరాబాద్: బంధువుల పుట్టిన రోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్యను చంపిన దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా(Rangareddy District) అబ్దుల్లాపూర్‌మెట్ లో జరిగింది. మేనకోడలు పుట్టిన రోజు వేడుకల్లో కేక్ కట్ చేస్తుండగా భార్యపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె మృతి చెందింది. భర్తతో గొడవపడి వచ్చిన భార్య అబ్దుల్లాపూర్ మెట్(Abdullapurmet)లో ఉంటుంది. సూర్యాపేట నుంచి వచ్చి భార్యను చంపిన అనంతరం నిందితుడి శ్రీనివాస్ పరారయ్యాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం పరారీలో ఉన్న శ్రీనివాస్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.