07-08-2025 08:20:23 PM
దేవాలయ చైర్మన్ నల్లపాటి నరసింహారావు..
కోదాడ: కోదాడ మండలం నల్లబండగూడెం సాయి మందిరంలో శ్రావణ గురువారం సందర్భంగా ముండ్రా రామారావు రమాదేవి, నలమోతు గిరిచంద్ర తేజస్విని, అనిల్ కుమార్ రమాదేవి దంపతులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు, అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ నలపాటి నరసింహారావు(Temple Chairman Nalapati Narasimha Rao) మాట్లాడుతూ, శ్రావణమాసం సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుళ్లపల్లి సురేష్, రవీంద్రబాబు,రమేష్,చెరుకూరి ప్రభాకర్, , సతీష్, పాపల్ల ప్రణీత్, పర్వాతనేని కృష్ణయ్య, శేషు, అర్చకులు సాయి శర్మ, శేషు నల్లపాటి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.