07-08-2025 08:23:40 PM
టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి..
మణుగూరు (విజయక్రాంతి): ఏరియాలోని కార్మికుల నివాస ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మందస్తు చర్యలు చేపట్టాలని, టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి వెంకటేశ్వర్లు(TBGKS Vice President Nagelli Venkateshwarlu) యాజమాన్యాన్ని కోరారు. గురువారం సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దోమలు వృద్ది చెంది పలు కాలనీలలో కార్మికులు వారి కుటుంబ సభ్యులు జ్వరాల బారిన పడుతున్నారని, ఆందోళన వ్యక్తం చేశారు.
విషజ్వరాలు, దోమల నివారణ కోసం ఫాగింగ్ తో పాటు బ్లీచింగ్, శానిటేషన్ పనులను వెంటనే చేపట్టాలన్నారు. కార్మికుల ఆరోగ్యం, సంక్షేమం కోసం ఏరియా యాజమాన్యం కృషి చేస్తుందని, కానీ పరిసరాల అపరిశుభ్రతలతో దోమలు వృద్ది చెంది మలేరియా, డమేరియా, ఫైలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు దృష్టి సారించి దోమలు వృద్ది చెందకుండా చర్య లను చేపట్టాలని కోరారు. యాజమాన్యం కార్మిక వాడలలో నెలకొన్న ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.