23-01-2026 12:55:27 AM
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
గోదావరిఖని,జనవరి22(విజయ క్రాంతి) ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రామ గుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. సింగరేణి ఏరియా హాస్పటల్లో ఏర్పాటు చేస్తున్న క్యాథ్ ల్యాబ్ సెంటర్ పనులను గురువారం ఎమ్మెల్యే, జీఎం లలిత్ కుమార్ తో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, క్యాథ్ ల్యాబ్ ప్రారంభమైతే రామగుండం పరిసర ప్రాంతాల ప్రజలు గుండె సంబంధిత చికిత్సల కోసం కరీంనగర్, హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మెరుగైన వైద్యం పొందవచ్చని తెలిపారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ రాకపోకలకు సౌలభ్యంగా ఉండేలా హాస్పటల్కు రెండు ప్రవేశ మార్గాలు ఉండాలని సూచించారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.