calender_icon.png 12 January, 2026 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు పనులను ప్రారంభించిన సుడా చైర్మన్

10-01-2026 12:00:00 AM

కొత్తపల్లి, జనవరి 9(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలో అలకాపురి కాలనీ 9వ డివిజన్ నెంబర్ తొమ్మిదిలో  పది లక్షలరూపాయలతో సిసి రోడ్డు పనులను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ శివారు కాలనీలలో సిసి రోడ్లు డ్రైనేజీలు ఇంకా పూర్తి చేయాల్సినవి చాలా ఉన్నాయని, సాధ్యమైనంత వరకు నిధులు మంజూరు చేసి తొందరగా పూర్తి చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో కుంట రాజేందర్ రెడ్డి, చర్ల పద్మ,బత్తిని చంద్రయ్య,ఇన్నారెడ్డి,గంగుల దిలీప్, వేణుగోపాల్ కర్వా తదితరులు పాల్గొన్నారు.