11-07-2025 12:51:54 AM
- పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి
మేడ్చల్, జూలై 10 (విజయక్రాంతి): మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ లోని రాజా శ్రీనివాస నగర్ లో రూ. కోటి మూడు లక్షల వ్యయంతో నిర్మించనున్న బాక్స్ డ్రైన్ పనులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వర్షాకాలంలో మీర్జాలగూడ, వెంకటాద్రి నగర్, రాజా శ్రీనివాస నగర్ తదితర లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద నీటితో ఇబ్బంది పడే వారిని, బాక్స్ డ్రైన్ నిర్మాణంతో ముంపు సమస్య ఉండబోదన్నారు.
నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునీత రామ యాదవ్, మల్కాజిగిరి సర్కిల్ ఇంజనీరింగ్ అధికారులు డి ఈ లౌక్య, ఏ ఈ దివ్య జ్యోతి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, నాయకులు బద్దం పరశురాం రెడ్డి, జేఏసీ వెంకన్న, ఏకే మురుగేష్, మేకల రాము యాదవ్, హేమంత్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.