01-01-2026 01:14:18 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్ ,డిసెంబర్ 31(విజయ క్రాంతి): సులభ్ కాంప్లెక్స్‌ను సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఏరియాలోని ఆటో స్టాండ్ వద్ద వాల్మీకి సఫాయి కర్మచారి సేవా సంఘ్ ఆధ్వర్యంలో బి. ఓ. టి. పద్ధతిలో నిర్మించిన సులభ్ కాంప్లెక్స్ ను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గజానన్, సిబ్బంది పాల్గొన్నారు.