‘సెయింట్ పాల్స్’లో సమ్మర్ క్యాంప్
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): సెయింట్ పాల్స్ హైస్కూల్, వావిలాలపల్లి, కరీంనగర్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ప్రత్యేక సమ్మర్ క్యాంప్ ప్రారంభించారు. ఈ సమ్మర్ క్యాంప్‌లు ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యా లు, కళాత్మక ప్రతిభ, శారీరక దృఢత్వం, మేధస్సు అభివృద్ధి చెందేలా పలు అంశాలలో శిక్షణ అందించబడుతుంది. అనుభ వజ్ఞులైన శిక్షకుల పర్యవేక్షణలో ప్రత్యేక తరగతులు నిర్వహించబడనున్నాయి.
డాన్స్,-- ఉదయం 8 నుంచి 9 గంటల వరకు-- ఫీజు రూ.1500, క్రికెట్ ఉదయం 6-8 వరకు,-- ఫీ జు రూ.3000, హ్యాండ్ రైటింగ్ ఉదయం 8-9, ఫీజు రూ.1500, కరాటే ఉదయం 9-10, ఫీజు రూ.1500, కబడ్డీ ఉదయం 8-9, ఫీజు రూ.2000, ఖో-ఖో ఉదయం 8-9, ఫీజు రూ.2000, బ్యాడ్మింటన్ ఉదయం 9-10, ఫీజు రూ.2000, అబాకస్ ఉదయం 9-10 వరకు -- ఫీజు రూ.2000. ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, శారీరక దృఢత్వం పెంపొందుతాయని యాజమాన్యం తెలిపింది. ఆసక్తి గల విద్యార్థులు పాఠశాల కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు.






