calender_icon.png 4 May, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీమా చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

03-05-2025 12:00:00 AM

నార్సింగి(చేగుంట), మే 2 : రోడ్డు ప్రమాదంలో మరణించిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి  పార్టీ సభ్యత్వ బీమా చెక్కు ను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అందజేశారు. ఇటీవల మండల పరిధిలోని నర్సంపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు పైతరి అంజ య్య రోడ్డు ప్రమాదంలో మరణించారు. శుక్రవారం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి  పైతరి అంజ య్య భార్య  శాంతమ్మ,కు రెండు లక్షల పార్టీ సభ్యత్వ బీమా చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అంజయ్య మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. అంజ య్య మరణించినా పార్టీ ఆయన కుటుంబానికి అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్  బక్కి వెంకటయ్య, సతీష్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మై లారం బాబు, పార్టీ పెద్ద తాండా అధ్యక్షుడు భాషా నాయక్, మంచి కట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.