02-01-2026 08:52:24 PM
అచ్చంపేట: ప్రభుత్వ ఉద్యోగ ఉత్తమ సేవలతోనే ఉన్నత గుర్తింపు లభిస్తుందని అచ్చంపేట ఆర్డిఓ యాదగిరి, డిఎస్పి పల్లె శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మురళి వేరువేరుగా ఆకాంక్షించారు. గతంలో జరిగిన లోపాలను సవరించుకొని ఏడాదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని అభిలాషించారు. టీఎన్జీవో 2026 క్యాలెండర్ను అచ్చంపేటలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో వేరువేరుగా ఆవిష్కరించారు. ముందుగా టీఎన్జీవో నేతలు ఉన్నతాధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఈ ఏడాది సాధించబోయే లక్ష్యాల గురించి చర్చించారు.