02-01-2026 08:56:08 PM
మంథని,(విజయక్రాంతి): సన్న ధాన్యానికి బోనస్ తో వ్యవసాయాన్ని పండగగా మార్చిన ప్రజా ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలుపుతూ... మంథని మండలంలోని కన్నాలలో రైతులు, కాంగ్రెస్ నాయకులు మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి గ్రామ సర్పంచ్ గుడిసె గట్టయ్య లు అన్నారు. గత ప్రభుత్వంలో వరి పంట వేస్తే ఉరి అన్న ప్రభుత్వం దానికి తోడు ప్రతి బస్తాకు రెండు మూడు కిలోల తరుగు తీస్తూ వ్యవసాయరే రైతులను నిలువు దోపిడీ చేస్తూ నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేని పేస్టో కమిటీ చైర్మన్ గౌరవ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చిన హామీ మేరకు సన్నధాన్యానికి రూ. 500 రూపాయలు రైతుల అకౌంట్లో బోనస్ డబ్బులు వేస్తూ రైతుల కళ్ళల్లో సంతోషాన్ని నింపుతున్న సందర్భంగా అలాగే కన్నాల గ్రామ ప్రజలు అడిగిన వెంటనే నాగారం ఎక్స్ రోడ్డు నుండి కన్నాల వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు రెండు కోట్ల 50 లక్షల రూపాయలు అలాగే కన్నాల మల్లెపెళ్లి లింకురోడ్డు కోటి 80 లక్షల రూపాయలు, మొత్తం నాలుగు కోట్ల 30 లక్షల రూపాయల నిధులు రోడ్ల విస్తరణకు మంత్రి కృషి చేశారని కొనియాడారు.