calender_icon.png 10 January, 2026 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తకొండ జాతర పనుల పర్యవేక్షణ

05-01-2026 12:51:42 AM

భీమదేవపల్లి, జనవరి 4 (విజయ క్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్త కొండ శ్రీ వీరభద్ర స్వామి జరగనున్న జాతర ఏర్పాట్లను ఆదివారం నాడు ఎల్కతుర్తి సీఐ పులి రమేష్, నేతృత్వంలో  పోలీసులు పర్యవేక్షించారు కొత్తకొండ వీరభద్రుని బ్రహ్మోత్సవాలు ఈనెల పదవ తేదీన స్వామి వారి కళ్యాణం తో ప్రారంభమవుతాయి 13, 14 భోగి మకర సంక్రాంతి పర్వదినం రోజున లక్షల్లో భక్తులు హాజరవుతుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ పేర్కొన్నారు.