calender_icon.png 10 January, 2026 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా అన్వేషణపై ఆస్ట్రేలియాలో ఫిర్యాదు

05-01-2026 12:50:46 AM

  1. వీసా రద్దుకు ఎన్నారైల డిమాండ్
  2. పంజాగుట్టలో మరోసారి కరాటే కల్యాణి ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 4 (విజయక్రాంతి): హిందూ దేవతలను, భారతీయ సంప్రదాయాలను కించపరిచేలా మాట్లాడిన యూట్యూబర్ నా అన్వేషణపై చర్యలు తీసుకోవాలని భారత్‌లో ఆయనపై మూడు కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయులు అన్వేషణపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి ఇమిగ్రేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అతడి ఆస్ట్రేలియా వీసాను తక్షణం రద్దు చేయాలని, భవిష్యత్తులో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టకుండా నిషేధం విధించాలని కోరారు.

మరోవైపు బీజేపీ నాయకురాలు కరాటే కల్యాణి ఆదివారం హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కేవలం ఐటీ యాక్ట్ 67 సెక్షన్ మాత్రమే ఉన్నదని, దానికి అదనంగా సెక్షన్ 69ఏ ను కూడా చేర్చాలని ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను, డాక్యుమెంట్లను పోలీసులకు అందజేశారు. అన్వేషణ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని, యూట్యూబ్ ఛానల్‌ను శాశ్వతంగా మూసివేయించాలని, విదేశాల నుంచి భారత్‌కు రప్పించి చట్టపరంగా శిక్షించాలని కోరారు.