22-11-2025 12:18:55 AM
పరిశీలించిన కార్పొరేటర్ ఏ. పావని వినయ్ కుమార్
ముషీరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ అశోక్ నగర్ లోని ఎస్బీహెచ్ కాలనీలో సుమారు రూ.22 లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న విడిసిసి రోడ్డు నిర్మాణం పనులను శుక్రవారం ఉదయం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ అధికారులు, కాలనీ వాసులు బిజెపి నాయకులతో కలిసి పర్యవేక్షించారు.
వివేక్ నగర్ ఆంజనేయ స్వామి దేవాలయం వెనకాల నుండి ఎస్బిహెచ్ కాలనీ వరకు చాలా కాలంగా రోడ్డు నడవలేని స్థితిలో వుందన్నారు. వాహన దారులు, కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్పొరేటర్ కు చేసిన ఫిర్యాదుతో జిహెచ్‌ఎంసి ఇంజి నీరింగ్ అధికారులు రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం పనులను వేగవంతంగా పూర్తి చేసి కాలనీ వాసులకు, ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. డివిజన్ లోని మరికొన్ని చోట్ల తమకు అందిన ఫిర్యాదుల మేరకు రొడ్డు మరమత్తు పనులను చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కార్పొరేటర్ వివరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సికిం ద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, జిహెచ్‌ఎంసి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గీత, అసిస్టెంట్ ఇంజినీర్ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్, కాలనీ వాసులు విశ్వనాథ్, విఠల్ రావు, రామ్ కిషోర్, కాంతి, శ్రీకాంత్, బిజెపి డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయిచంద్, శ్రీకాంత్, దామోదర్, పి.నర్సింగ్ రావు, శివ కుమార్, ఎం. ఉమేష్, సురేష్ రాజు, ఆనంద్ రావు, శ్రీనివాస్ యాదవ్, రాజేందర్, నీరజ్, రఘు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.