19-05-2024 12:42:32 AM
కామారెడ్డి కలెక్టర్ జితేష్ వీ పాటిల్
కామారెడ్డి, మే 18 (విజయక్రాంతి): పదవ తరగతి, ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వీ పాటిల్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహణపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. 10,511 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. వీరికోసం 29 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక జూన్ 3 నుంచి 13 వరకు పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.30 వరకు జరగనున్నాయి. 869 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. కామారెడ్డి, బాన్సువాడ మండల కేంద్రాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఇంటర్‌మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, డిఇవో రాజు, ఇంచార్జి జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, ఆర్టీసి డిపో మేనేజర్ ఇందిర, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ జ్యోతి, విద్యుత్ శాఖాధికారి మల్లేష్ తదితరలు పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలి
పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలి
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పక డ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ సమావేశ మం దిరంలో సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లతో పాటు పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ రామదాసు తేజావత్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి జయచంద్రమోహన్, తహసీల్దార్ కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.