calender_icon.png 10 November, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

19-05-2024 12:37:59 AM

కామారెడ్డి, మే 18 (విజయక్రాంతి) : కామారెడ్డి పట్టణంలో స్వీట్ హోమ్స్‌లో జిల్లా ఫుడ్ సేప్టీ అధికారి సునీత శనివారం తనిఖీలు చేపట్టారు. తినుబండారాల తయారీ, పరిసరాలు, వస్తు సామ్రగి, ఇతరత్రా అంశాలను పరిశీలించారు. కొన్సి సరుకుల ఎక్స్‌పైరీ డేట్‌ను పరిశీలించి, ఫైన్ వేశారు.  స్టేషన్ రోడ్, సిరిసిల్ల రోడ్, తిలక్ రోడ్, జెపిఎన్ రోడ్, నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ రోడ్‌లో గల స్వీట్ హోమ్‌లో సోదాలు జరిగాయి.  ఆహార పదార్థాల తయారీలో స్వీట్‌హోమ్స్ నిర్వాహకులు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కల్తీ వస్తువులు అమ్మకూడదని హెచ్చరించారు.   తనిఖీలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శిరీష, మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవీందర్ పాల్గొన్నారు.