calender_icon.png 7 July, 2025 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైఫల్యాలను అధిగమిస్తే విజయాలు

12-06-2025 01:39:57 AM

ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య

నల్లగొండ టౌన్, జూన్ 11 : వైఫల్యాలను అధిగమించడానికి కొత్త విషయాలను నేర్చుకోవడం ద్వారనే విజయాలను సాధిస్తారని నల్లగొండ ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య చెప్పారు. బుదవారం ఎంవియన్ విజ్ఞాన కేంద్రంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్ధులకు సర్టిఫికేట్స్ పంపిణి చేశారు. పై చదువులకు వెళ్లాలంటే ఒకటో తరగతి ఎంత ముఖ్యమో కంప్యూటర్ విద్యను అభ్యసించాలంటే పిజిడిసిఏ అంతే ముఖ్యమని అన్నారు.

విద్యార్ధులు చదువుకొవడానికి ప్రస్తుతం నల్లగొండలో ఎంవియన్ విజ్ఞాన కేంద్రం ఇంత పెద్ద అవకాశం కల్పిచడాన్ని అభినందించారు. కంప్యూటర్తో పాటు అన్ని రంగాలలో రాణించాలని అన్నారు. అలాగే మన విద్యార్ధులు విదేశి విధ్యార్దుల కంటే గ్రామర్లో, అక్షరదోషాలు రాకుండా ఉండటంలో ముందుటున్నారని అన్నారు.

పోటి పరిక్షలకు ప్రిపేరు అయ్యే విధ్యార్ధులకు అంగ్ల బాషలో కమ్యూనికేషన్ స్కీల్స్ ముఖ్యమని చెప్పారు. ఎంవియన్ విజ్ఞాన కేంద్రం కార్యనిర్వహణ కార్యదర్శి పి నర్సిరెడ్డి, గ్రంధాలయ ఇంచార్జీ పి. యాదగిరి, ప్యాకల్టీ పి. శంకర్ తదితరులు పాల్గొన్నారు.